అంగన నిన్నడిగి రమ్మనె
Wikisource నుండి
ప|| అంగన నిన్నడిగి రమ్మనె నీమాట | సంగతిగ మరుమాట సరి నాన తీవయ్యా ||
చ|| చెలులచే నింతి నీకు చెప్పిపంపిన మాటలు | తలచుకొన్నాడవా దయతో నీవు | తొలుత గాను కంపిన దొడ్డ పూవుల బంతి | లలిమించిన పరిమళము గొంటివా ||
చ|| చాయల నాసతో నాపె సారె జూచిన చూపులు | ఆయములు గరచేనా అంటుకొనెనా | చేయెత్తి సిగ్గుతోడ చేరి మొక్కిన మొక్కులు | ఆయనా నీకు శలవు అందరిలోనా ||
చ|| బెరసి తెరమాటున బెట్టిన నీపై సేసలు | శిరసుపై నిండెనా చిందెనా నీపై | అరుదై శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె | గరిమ నిన్ను గూడి గద్దెపై గూచున్నది ||
pa|| aMgana ninnaDigi rammane nImATa | saMgatiga marumATa sari nAna tIvayyA ||
ca|| celulacE niMti nIku ceppipaMpina mATalu | talacukonnADavA dayatO nIvu | toluta gAnu kaMpina doDDa pUvula baMti | lalimiMcina parimaLamu goMTivA ||
ca|| cAyala nAsatO nApe sAre jUcina cUpulu | Ayamulu garacEnA aMTukonenA | cEyetti siggutODa cEri mokkina mokkulu | AyanA nIku Salavu aMdarilOnA ||
ca|| berasi teramATuna beTTina nIpai sEsalu | Sirasupai niMDenA ciMdenA nIpai | arudai SrI vEMkaTESa alamElumaMga yIke | garima ninnu gUDi gaddepai gUcunnadi ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
|